సమైక్య షాక్‌

 

తెలంగాణ నోట్‌కు కేభినెట్‌ ఆమోదం లభించిన నేపధ్యంలో వెల్లువెత్తున్న నిరసనలు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. సీమాంద్ర జిల్లాల్లోని విద్యుత్‌ ఉద్యోగులు సమ్మెకు దిగటంతో ఉత్పత్తితో పాటు, సరఫరా వ్యవస్థలు కూడా అస్థవ్యస్థంగా మారుతున్నాయి.

 

దీనికి తోడు సీమాంధ్ర విద్యుత్‌ జేఏసీ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగటంతో పరిస్థితి మరింత దారుణంగా తయారయింది. ఇప్పటికే జల విద్యుత్‌, బొగ్గు ఉత్పత్తి కేంద్రాల్లో అవాంతరాలు విద్యుత్‌ ఉత్పత్తిని దెబ్బతీస్తున్నా యి. ఈ ప్రభావం ఆంద్ర ప్రదేశ్‌తో పాటు దాదాపు దక్షిణాది రాష్ట్రాలన్నింటి మీద కనిపించనుంది.

 

ఎన్‌టీపీసీలోని ఆరు యూనిట్లలో 1250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. ఎన్‌టీ పీసీలో మొత్తం 1510 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలి చింది.  ఆర్‌టీపీపీలోనూ 2560 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచింది. సీలేరు జలవిద్యుత్‌ కేంద్రంలో 240 మెగావాట్ల వద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేశారు.

 

పరిస్థితి మరి కొద్ది రోజులు ఇలాగే కొనసాగితే సీమాంద్ర ప్రాంతంతోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పాటు దక్షిణాది మొత్తం అంధకారంగా మారనుంది. ఏ  పరిస్ధిత్తుల్లో అయినా దక్షిణాది పవర్‌ గ్రిడ్‌ ఫెయిల్‌ అయిన పక్షంలో దాని మరమ్మత్తులకు దాదాపు వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుందంటున్నారు విధ్యుత్‌ రంగ నిపుణులు.