TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కరెంట్ కోతలతో అంధేరాప్రదేశ్‌గా మారింది :దత్తాత్రేయ

Published on: Sun Dec 25, 2011 1:38PM

హైదరాబాద్:  కరెంట్ కోతలతో మన రాష్ట్రం అంధేరాప్రదేశ్‌గా మారిందని బీజేపీ సీనియర్ నేత బంగారు దత్తాత్రేయ అన్నారు .రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరత అన్ని రంగాలను దెబ్బతీస్తోందని అయన  పేర్కొన్నారు. ఖరీప్ సీజన్‌లోనే పరిస్థితి దారుణంగా తయారయిందని అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా కరెంట్ కోత ఉందని ఆయన విమర్శించారు. కరెంట్ కోతలతో మన రాష్ట్రం అంధేరాప్రదేశ్‌గా మారిందని దుయ్యబట్టారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఆయన 40వ బహిరంగ లేఖ రాశారు. గుజరాత్‌ను ఆదర్శంగా తీసుకుని సాంప్రదాయేతర ఇంధన విద్యుత్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని లేఖలో దత్తాత్రేయ కోరారు.