తెలుగు రాష్టలకు పొంచి ఉన్న విద్యుత్ కొరత.. ఇక పవర్ కట్ లు తప్పవా?

తెలుగు రాష్ట్రాలకు విద్యుత్ గండం పొంచి ఉంది. విద్యుత్ బకాయిల కారణంగా కేంద్రం 11 రాష్ట్రాలకు విద్యుత్ విక్రయాన్ని నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది. ఆ 11 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా3 ఉన్నాయి. కేంద్రం ఆదేశాల మేరకు గురువారం (ఆగస్టు 18) అర్ధరాత్రి నుంచి ఎక్స్ంజ్ లలో విద్యుత్ కొనుగోలు నిలిచిపోయింది. కేంద్రం నిర్ణయంతో తెలుగు రాష్ట్రాలకు ముందు ముందు విద్యత్ కొరత ఏర్పడ నుంది.  

అవసరాలను బట్టి తెలంగాణ డిస్కమ్ లు రోజూ 5 నుంచి 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను కొనుగోలు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు కేంద్రం ఆదేశాలతో విద్యుత్ కొనుగోలుకు ఆటంకం అనివార్యం అవుతుంది.

తెలంగాణ నుంచి రూ.1300 కోట్లకుపైగా చెల్లించాలని, ఏపీ డిస్కమ్ ల నుంచి రూ.400 కోట్లకుపైగా బకాయిలు రావాల్సి ఉంది. కేంద్రం నిర్ణయం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకే కాకుండా తమిళనాడు, కర్నాటక, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మణిపూర్, మిజోరం, జమ్ముకశ్మీర్,  రాష్ట్రాలకు విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం లేదు.