TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శోభ‌నం 'హ‌ల్వా'కు అరుదైన గుర్తింపు.. కాకినాడ కాజాకు మ‌రో గౌర‌వం..

Published on: Thu Jan 6, 2022 2:43PM

రుచులందు కొన్ని రుచులు వేరు. విభిన్న రుచుల‌కు ఆంధ్ర ఫుల్ ఫేమ‌స్‌. బంద‌రు ల‌డ్డు, పూత‌రేకులు, మామిడితాండ్ర‌, కోవాక‌జ్జికాయ‌, సున్నుండ‌లు.. ఇల ర‌క‌ర‌కాల నోరూరించే రుచులు. ఇక కొన్నైతే.. వాల్డ్ ఫేమ‌స్‌. అందులో టాప్ ప్లేస్‌లో ఉంటుంది కాకినాడ కాజా.. అలియాస్ కోట‌య్య కాజా. 

మ‌డ‌త కాజా చాలామందికి తెలుసు. గొట్టం కాజా మాత్రం కాకినాడ స్పెష‌ల్‌. చూట్టూ నేతిలో కాల్చిన‌ మైదాతో చేసిన గొట్టం.. మ‌ధ్య‌లో తియ్య‌టి పాకం. కొరికితే.. స‌గం జ్యూస్‌.. స‌గం క్రంచ్‌. ఇప్పుడు బిస్కెట్ మధ్యలో చాక్లెట్‌తో.. ఈ టెక్నిక్ వాడుతున్నా.. 1891లోనే కోట‌య్య అనే వ్య‌క్తి 'గొట్టం కాజా' త‌యారు చేశారు. ఆయ‌న‌ పేరుమీదుగా కోట‌య్య కాజా అంటూ కాకినాడ‌కే ప్ర‌త్యేక గుర్తింపు తీసుకొచ్చారు. గోదావ‌రి జిల్లాల వాసులు బాగా ఇష్ట‌ప‌డ‌తారు. ఇత‌ర రాష్ట్రాల‌కు, విదేశాల‌కు పార్సిల్స్ పంపిస్తుంటారు. అలా, కాకినాడ కాజాకు ప్ర‌పంచ ఖ్యాతి వ‌చ్చింది. తాజాగా, వందేళ్ల‌కు పైగా తీపి రుచిని పంచుతున్న కాకినాడ గొట్టం కాజాతో పోస్ట‌ల్ శాఖ ప్ర‌త్యేక స్టాంపును విడుద‌ల చేసి మ‌రింత గుర్తింపు తీసుకొచ్చింది. 

2018లో కాకినాడ‌ కాజాకు జియోగ్రాఫిక్‌ ఇండికేషన్ ల‌భించ‌డంతో అంతర్జాతీయంగా మరింత ప్రచారం వ‌చ్చింది. ఇపుడు భారత తపాలా శాఖ కాకినాడ‌ కాజాతో పోస్టల్ల్  కవర్ తీసుకురావ‌డంతో ఆంధ్రుల‌కు మ‌రింత గౌర‌వం ల‌భించింది. 

కాకినాడ గొట్టం కాజాతో పాటు విశాఖ జిల్లాకు చెందిన "మాడుగుల హల్వా"కు కూడా విశిష్ట స్థానం కల్పించింది భారతీయ పోస్టల్ శాఖ. ఈ హ‌ల్వాకు సైతం 110 ఏళ్ల చ‌రిత్ర ఉంది. మాడుగుల ప్రాంతంలో 1890 నుంచి హల్వా తయారు చేస్తున్నారు. గోధుమలు, పాలు, నెయ్యి, బాదం, జీడిపప్పుల‌తో రుచికరమైన హల్వాను తయారు చేస్తారు. ఈ హల్వాకు లైంగిక సామర్థ్యం పెంచే గుణం ఉంద‌ని అంటారు. అందుకే.. ఇది శోభ‌నం స్వీట్‌గా పేరుగాంచింది. లేటెస్ట్‌గా,  పోస్టల్ శాఖ మాడుగుల హల్వా ఫోటోతో ఓ పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేయ‌డంతో దాని ప్రాముఖ్యం మ‌రింత పెరిగింది. ఇలా, కాకినాడ కాజా, మాడుగుల హ‌ల్వాలు పోస్ట్ స్టాంటుల‌తో మ‌రోసారి దేశ‌వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వ‌చ్చాయి.