దేశంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు
Published on: Fri Apr 14, 2023 4:21PM
కరోనా మహమ్మారి ప్రజలను వణికిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో అక్కడ 1527 కొత్త కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ రేట్ 27.77 శాతం పెరిగింది. అంటే ప్రతీ వందమందిలో 28 మంది పాజిటివ్ అని తేలింది. గత 24 గంటల్లో రాజధానిలో రెండు మరణ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 909 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 3962కి పెరిగాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 11109 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేరళ, మహరాష్ట్రలో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.


