చంద్రబాబు మీద పోసాని మళ్ళీ ఫైర్...!

 

పోసాని కృష్ణ మురళి.. సినిమాల్లో బిజీగా ఉంటూ అప్పుడప్పుడు రాజకీయాల వైపు తొంగి చూస్తుంటారు.. గత కొంతకాలంగా వైసీపీకి, జగన్ కి మద్దతుగా మాట్లాడుతున్న పోసాని.. తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చంద్రబాబు మీద మండిపడ్డారు.. 'ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి సీఎం స్థాయికి ఎదిగాడని.. పదవి కోసం బాబు ఎవరి గొంతైనా కోస్తాడని' అన్నారు.. 'ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన బాబు, కేసీఆర్ కి భయపడి విజయవాడ పారిపోయాడు' అని ఆరోపించారు.. 'ప్రత్యేకహోదాని, ప్రత్యేక ప్యాకేజీకి తాకట్టు పెట్టిన బాబు.. ఇప్పుడు యూ టర్న్ తీస్కొని మళ్ళీ ప్రత్యేకహోదా అంటున్నాడు' అంటూ పోసాని మండిపడ్డారు..ఇలా అసందర్బంగా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు మీద విమర్శలు చేయడం పట్ల.. కొందరు తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియా వేదికగా పోసాని మీద మండిపడుతున్నారు.. ఎంత ఇచ్చి నీతో ఇలా మాట్లాడిస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మరి పోసాని ఈ కామెంట్స్ ని లైట్ తీసుకుంటారో లేక మరో ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తారో చూడాలి.