TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం

Published on: Wed Mar 5, 2025 7:58AM

ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ కల్పన ఆత్మహత్యాయత్నం చేశారు.  హైదరాబాద్ నిజాంపేటలోని వర్టెక్స్ ప్రీ విలేజ్ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్న కల్పన  నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రెండు రోజులుగా ఇంటి తలుపులు తెరవక పోవడం,  ఫోన్ కి అందుబాటులో లేకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో వారు వచ్చి కల్పన ఇంటి తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్లి చూడగా కల్పన అపస్మారక స్థితిలో ఉన్నారు. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కల్పన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు.  కల్పన ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియాల్సి ఉంది. కాగా కల్పన గత కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్నారని ఆమె సన్నిహితులు తెలిపారు.  

కల్పన టాలీవుడ్ లో పాపులర్ సింగర్స్ లో ఒకరు. అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నటిగా కూడా ఆమె సుపరిచితురాలు.  అటువంటి కల్పన ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనంగా మారింది.