ఇద్దరు చంద్రులు పిల్లులు... నరేంద్ర మోదీ ఓ కోతి!??

 

తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది! తెలంగాణ తొలి, ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రత్యర్థులపై పదునైన విమర్శనాస్త్రాలతో ప్రచార పర్వంలో దూసుకు వెళ్తున్నారు. ముఖ్యంగా నవ్యాంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర పదజాలంతో విరుచుకు పడుతున్నారు. చంద్రబాబు విమర్శల్ని తిప్పి కొడుతున్నారు. నేరుగా ఇద్దరు చంద్రులు పేరు ప్రస్తావించకున్నా... ఆంధ్ర, తెలంగాళ వాళ్ళు ఫైట్‌ చేసుకుంటే ఎవరికి ఫైదా(లాభం)? అని నటి పూనమ్‌కౌర్‌ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. చిన్నతనంలో స్కూల్‌లో చదువుకున్న ఓ కథ గుర్తొస్తుందని రెండు పిల్లులు, ఓ కొతి బొమ్మను పోస్ట్‌ చేశారామె.

 

 

ఒక్కసారి ఆ కథేంటి? అనేది గుర్తుచేసుకుంటే... రెండు పిల్లులు చాలా స్నేహంగా వుండేవి. ఒకరోజు ఒక ఇంటి నుంచి రొట్టెముక్కను దొంగతనం చేస్తాయి. ఇద్దరూ కష్టపడి రొట్టెను దొంగిలించాయి కనుక సమానంగా పంచుకోవాలని పిల్లులు అనుకుంటాయి. వాటాల్లో రెండు పిల్లుల మధ్య గొడవ మొదలవుతుంది. ఇది గమనించిన కోతి సమానంగా పంచుతానని చెప్పి మొత్తం రొట్టెను కాజేస్తుంది. తినేస్తుంది. ఈ కథను గుర్తచేసే కార్టూన్‌ బొమ్మను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన పూనమ్‌ కౌర్‌ ‘‘ఆంధ్ర... తెలంగాణ... మనవాళ్ళే ఫైట్‌ చేసుకుంటూ వుంటే ఫైదా ఎవరికి అబ్బా? నాకు అర్థం కావట్లే. ఇదిగో ఈ స్కూల్‌ స్టోరీ గుర్తొచ్చింది’’ అని పేర్కొన్నారు. ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర అనగానే చాలామంది నెటిజన్లు ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అని ఒక అంచనాకు వస్తున్నారు. అందులో నిజమేంత? అబద్దమెంత? అనేది పక్కన పెడితే... కోతి ఎవరు? కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమా? లేదా దేశప్రధాని నరేంద్ర మోదీయా? ప్రేక్షకుల ఊహకు వదిలేస్తున్నాం!!