TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాలుజారిన పూనమ్!

Published on: Tue May 13, 2014 12:09PM

 

నిన్నటి తరం గ్లామర్ హీరోయిన్ పూనమ్ ధిల్లాన్ వయసు మీద పడినా తన గ్లామర్‌ని ఎంతమాత్రంకోల్పోకుండా అప్పట్లో ఎలా మిలమిలా మెరిసేదో ఇప్పుడు కూడా మిలమిలా మెరవడమే కాకుండా చమక్‌మని అంటూ వుంటుంది. అలాంటి పూనమ్ ధిల్లాన్ లేటెస్ట్ గా కాలుజారి పడిపోయింది. ఇదెలా జరిగిందంటే, ముంబైలోని ప్రముఖ డిజైనర్ విక్రమ్ ప్రడ్నిస్ ఏర్పాటు చేసిన ఫ్యాషన్ ఈవెంట్‌కి పూనమ్ ధిల్లాన్ చీఫ్ గెస్ట్ గా హాజరైంది. ర్యాంప్ మీద యువతరం మోడల్స్ తమ కులుకులు ప్రదర్శిస్తుండగా, పూనమ్ ధిల్లాన్ నేను మాత్రం తక్కువా అన్నట్టుగా తాను కూడా ర్యాంప్ మీద నడుస్తూ హొయలు పోయింది. అయితే ఆమె హైహీల్ చీరకి తగలడంతో పూనమ్ ధిల్లాన్ ర్యాంప్ మీదే బొక్కబోర్లా పడిపోయింది. ఆ తర్వాత లేచి నిలబడింది. అలా అందరిముందూ పడిపోవడంతో పూనమ్ ధిల్లాన్ మొదట్లో ఇబ్బంది పడినా ఆ తర్వాత ముఖం నిండా నవ్వులు పులుముకుని ర్యాంప్ మీద నుంచి దిగిపోయింది.