ఉజ్జయినీ మహంకాళి జాతరలో రాజకీయం?
Published on: Mon Jul 9, 2012 12:36PM
రాజకీయం చేసేందుకు జాతరలను కూడా వేదిక చేసుకుంటున్నారు. జనబాహుళ్యాన్ని దగ్గర చేసుకోవాలంటే ఇటువంటి జాతరలు ఉపయోగపడతాయని పార్టీలు భావిస్తుంటాయి. అందుకే కాబోలు తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నేతలు ఈ జాతర నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. అందుకనే తెలుగుదేశం పార్టీ అథినేతకు చంద్రబాబునాయుడుకు సాదర స్వాగతం లభించింది. ఆయన తిరిగి వెళ్లేటప్పుడు కారు వద్దకు కూడా భక్తులు, తెలగుదేశం కార్యకర్తలు చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు తలసాని శ్రీనివాసయాదవ్, బాబుకు సంతృప్తికరంగా వీడ్కోలు కూడా పలికారు. దీనికి ముందు సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి వస్తే దర్శనానికి ముందుకు ఒకసారి సిఎం డౌన్‌డౌన్ అని నినాదాలు చేశారు. వెనుదిరిగి వెళ్లేటప్పుడు కూడా మళ్లీ అవేనినాదాలు చేశారు. అయితే ఆయన అమ్మవారికి పట్టుచీర సమర్పించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో పూజలు సక్రమంగా చేసి ప్రజలను ఆదరించాలని నిర్వాహకులను కోరారు. అతితక్కువ సమయంలోనే వెనక్కి వెళ్లిపోయారు. అయినా సరే! ఈ ఆలయ పెద్దలు తెలుగుదేశం పార్టీకి చూపినంత ఆదరణ సిఎంకు ఇవ్వలేదు. విఐపిల దర్శనం వల్ల ఆలస్యమైనందున భక్తులు ఇలా నినాదాలు చేశారని కొందరు సర్ధిచెప్పారు. రాజకీయవేదికగా తెలుగుదేశం పార్టీ ఈ జాతరను వినియోగించుకోటం అందరినీ విస్మయపరిచింది.


