రాజకీయాల్లో బ్రాహ్మణుల అన్యాయం
Published on: Sat Mar 10, 2012 1:15PM
హై
దరాబాద్: రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీలు బ్రాహ్మణవర్గాన్ని అణచివేసేందుకు పనిచేస్తున్నాయని ఆ వర్గానికి చెందిన అతిరథ మహారథులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వీరందరూ గుంటూరులోని ఒక ప్రైవేట్ ఫామ్ హౌస్ లో సమావేశమై సుదీర్ఘమంతనాలు జరిపారు. ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించిన బ్రాహ్మణులు నేడు రాష్ట్రంలో కరివేపాకు రెమ్మలుగా తయారయ్యారని, అన్నిపార్టీలు వారిని వాడుకుని వదిలేస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో లక్షలాది మంది బ్రాహ్మణులు ఉన్నప్పటికీ తమ సామాజికవర్గానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఒక ఎంపి, ఒక మంత్రి మాత్రమే పదవుల్లో ఉన్నారని వారు విశ్లేషించారు. తమకన్నా తక్కువ సంఖ్యలో ఉన్న ఇతర సామాజికవర్గాల వారు అనేక పదవులు పొందుతూ ముందుకుపోతున్నాయని, తాము మాత్రం వేదాలు వల్లించుకుంటూ అణగారిపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో బ్రాహ్మణ సత్తా ఏమిటో చూపించాలని నిర్ణయించారు. తమ సామాజికవర్గ జనాభా నిష్పత్తి ప్రాతిపదికగా సీట్లు కేటాయించే పార్టీలకే ఓట్లువేయాలని నిర్ణయించారు.


