TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తనపై ఆరోపణలను ఖండించిన ఎమ్మెల్యే కవిత

Published on: Wed Feb 8, 2012 1:31PM

హైదరాబాద్: తనపై వచ్చిన ఆరోపణలను మహబూబాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కవిత ఖండించారు. తాను మద్యం వ్యాపారుల నుండి ముడుపులు తీసుకున్నట్లుగా వచ్చిన వార్తలను బుధవారం ఆమె ఖండించారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆమె అన్నారు. దోపిడీదారుడైన రమణ ఆరోపణలను ఏసీబీ ఎలా పరిగణనలోకి తీసుకుంటుందని ఆమె ప్రశ్నించారు. ఇప్పటి వరకు తన కుటుంబంపై ఎలాంటి మచ్చ లేదన్నారు. మద్యంను ఎమ్మార్పీ ధరకే అమ్మాలని గతంలో తాను ముఖ్యమంత్రిని పలుమార్లు కోరానని అన్నారు. అలాంటి తాను ముడుపులు ఎందుకు తీసుకుంటానన్నారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని... తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఆమె అన్నారు.

మరోవైపు తాను మద్యం వ్యాపారుల నుండి ముడుపులు తీసుకున్నానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని సిపిఎం నేత నాగేశ్వరరావు చెప్పారు. తాను నాలుగేళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని, అలాంటి తనపై బురద జల్లడం సరికాదన్నారు. సిపిఐ న్యూడెమోక్రసీ కూడా ముడుపుల ఆరోపణలను ఖండించింది.