స్వాతంత్ర్యం వచ్చినా ఓటు బ్యాంకు రాజకీయాలా?మోడీ
Published on: Sat Jan 21, 2012 10:46AM
హైద
రాబాద్: దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పాలని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఆయన గోద్రాలో చేపట్టిన సద్భావన దీక్షలో భాగంగా మాట్లాడుతూ..దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆరు దశాబ్దాల తర్వాత కూడా పార్టీలు అధికారం కోసం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు. దేశ ప్రజలకు ఓటు బ్యాంకు రాజకీయాలు కావాలో, అభివృద్ధి రాజకీయాలు కావాలో ప్రజలే తేల్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలను విభజించి పాలించే ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో పౌష్టికాహార లోపం సమస్యపై ప్రధానిగా ఉన్నత స్థానంలో ఉన్న ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఇంత ఆలస్యంగా మేలుకోవడం సిగ్గుచేటన్నారు. 15 యేళ్లుగా తమ ప్రభుత్వం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పాటుపడిందన్నారు. ద్రవ్యోల్బణం పెరగడానికి కేంద్రమే నైతిక బాధ్యత వహించాలన్నారు.


