రాజకీయాల్లో ప్రకంపనలు లిక్కర్ సిండికేట్స్‌పై ఎసిబి సమీక్ష
Published on: Mon Dec 19, 2011 12:32PM
హై
దరాబాద్: రాష్ట్రంలోని లిక్కర్ సిండికేట్స్‌పై తాము జరిపిన సోదాలపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) ఉన్నతాధికారులు సోమవారం సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ సిండికేట్స్‌పై ఎసిబి నిర్వహించిన సోదాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. లిక్కర్ సిండికేట్స్ వ్యవహారంలో రాజకీయ నాయకులకు, శాసనసభ్యులకు, మంత్రులకు, మీడియా ప్రతినిధులకు పాత్ర ఉందని, వారికి పెద్ద యెత్తున ముడుపులు అందాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎసిబి ఉన్నతాధికారుల సమీక్షకు ప్రాధాన్యం ఏర్పడింది. సమీక్ష అనంతరం ఎసిబి ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై లిక్కర్ సిండికేట్ల విషయంలో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నాలుగు జిల్లాల్లో ఆయన హవా సాగుతోందని మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సోదాల వివరాలను వెల్లడించాలని బొత్స సత్యనారాయణ ఎసిబికి సూచించారు.


