ఆ మీడియాపై నిషేధం.. మ‌రి మీరు ప‌తివ్ర‌త‌లా?

posted on: Jan 7, 2022 12:12PM

మంత్రి కొడాలి నాని తెలుసుగా. ఆయ‌న మాట్లాడితే.. ఆ వీడియోకి బీప్ సౌండ్‌లు వేయాల్సిందే. లేదంటే రూల్స్ ఒప్పుకోవు. ఆ బాష‌ను స‌భ్య‌స‌మాజం అంగీక‌రించ‌దు. పైగా అస‌హ్యించుకుంటుంది. అలాంటి ఆయ‌న‌.. లేటెస్ట్‌గా మ‌రో బ్రేకింగ్ న్యూస్ చెప్పారు. కొన్ని న్యూస్ ఛానెల్స్‌ను నిషేధిస్తున్నామ‌ని తెలిపారు. అందుకు ఆయ‌న చెప్పిన కార‌ణం.. ఆ మీడియా ఎల్ల‌ప్పుడూ అస‌త్య క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తోంద‌ట‌. ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తోంద‌ట‌. ఆ ఆరోప‌ణ‌ల‌తో.. టీవీ 5, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈటీవీలపై ఎల్లో ముద్ర వేసేసి.. వాటిని మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నిషేధిస్తున్నామని నాని ప్ర‌క‌టించేశారు.  

ఇదేమీ షాకింగ్ న్యూస్ మాత్రం కాదు. గ‌తంలోనే ఆయా వార్తా సంస్థ‌ల‌ను వైసీపీ ఎప్పుడో బ‌య్‌కాట్ చేసింది. ఆ టీవీ ఛానెల్స్‌లో చ‌ర్చ‌ల‌కు వైసీపీ నాయ‌కులు వెళ్ల‌రు. వాళ్ల పార్టీ మీడియా స‌మావేశాల‌కు వారిని రానివ్వ‌రు. పాత విష‌యాన్నే మ‌రోసారి కొత్తగా చెప్పారు కొడాలి నాని. 

ఇంత‌కీ ఆ ఛానెల్స్‌పై వైసీపీకి అంత కోపం ఎందుకొచ్చింది అనేదే ప్ర‌శ్న‌. వెరీ సింపుల్‌. ప్ర‌భుత్వం ఏదో ప్ర‌క‌ట‌న చేస్తుంది.. అందులో లోటుపాట్ల‌ను, మ‌భ్య‌పెట్టే అంశాల‌ను వీళ్లు వెలికి తీస్తారు. జ‌నాల జేబుల‌కు ప్ర‌భుత్వం పెడుతున్న చిల్లుల‌ను బ‌య‌ట‌పెడ‌తారు. వైసీపీ నేత‌ల అరాచ‌కాల‌ను, అక్ర‌మాల‌ను వివ‌రిస్తారు. ఇది చాల‌దా.. ఆ మీడియాపై కోపం పెంచుకోడానికి. వాటిని నిషేధించ‌డానికి.. అంటున్నారు. 

ఏపీలో మీడియా మొత్తం రెండు వ‌ర్గాలుగా చీలిపోయింద‌నే ఆరోప‌ణ ఎప్ప‌టి నుంచో ఉంది. బ్లూ మీడియా, ఎల్లో మీడియా.. అంటూ జ‌గ‌న్‌, చంద్ర‌బాబు స‌పోర్ట‌ర్స్‌గా మారింది. టీవీ9, ఎన్టీవీ, సాక్షి.. లాంటివి జ‌గ‌న్ భ‌జ‌న చేసే అనుకూల సంస్థ‌ల‌ని అంద‌రికీ తెలుసంటారు. ఇలా కొన్ని ఛానెళ్లు వైసీపీకి, మ‌రికొన్ని టీడీపీ.. స‌పోర్ట్‌గా ఉంటున్నాయి. ఇదేదో కొత్త విష‌యంలా.. కొడాలి నాని ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ.. కొన్ని మీడియా సంస్థ‌ల‌పై నిషేధం అంటూ, అస‌త్య క‌థ‌నాలంటూ నీతివ్యాఖ్యానాలు చేసి.. నిషేధాజ్ఞ‌లు విధించ‌డం కామెడీ కాక మ‌రొక‌టి కాదంటున్నారు. అంతా ఆ తాను ముక్క‌లేన‌ని అంటున్నారు. ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఉండేది బ్లూ మీడియా..  ప్ర‌భుత్వ విధానాల లోటుపాట్ల‌ను తెలియ‌జెప్పేది ఎల్లో మీడియా.. అంతేగా.. అంతేగా. మ‌రెందుకు ఇంత‌టి ఓవ‌రాక్ష‌న్ అంటున్నారు వ్యూయ‌ర్స్‌.

google-ad-img
    Related Sigment News
    • Loading...