TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎల‌క్ష‌న్‌ బ‌రిలో 'బికినీ గర్ల్‌'.. ఓటర్లకు పండగ.. రచ్చ రంబోలా..

Published on: Mon Jan 17, 2022 11:18AM

ఆమె 'మిస్ బికినీ'. హాట్ హాట్ డ్రెస్సుల్లో హాట్ హాట్‌ ఫిగ‌ర్ ఆమెది. మోడ‌ల్‌గా ఫేమ‌స్‌. ఆ త‌ర్వాత సినిమాలు, సీరియ‌ళ్లతో ఫుల్ పాపులారిటీ. ఇది చాల‌దా.. జ‌నాల‌ను ఆక‌ర్షించ‌డానికి. అందుకే ఆ ఒక‌ప్ప‌టి బికినీ గ‌ర్ల్‌ను యూపీ ఎల‌క్ష‌న్ బ‌రిలో నిలిపింది కాంగ్రెస్ పార్టీ. ఆమె ఫేస్ చూసి, ఫిగ‌ర్ చూసి ఓట్లు ప‌డిపోతాయ‌నే భ‌య‌మో ఏమో.. బీజేపీ గ‌గ్గోలు మొద‌లుపెట్టేసింది. అందుకే ఇప్పుడు ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ కేండిడేట్ అర్చ‌నా గౌత‌మ్‌పై పొలిటిక‌ల్ ర‌చ్చ న‌డుస్తోంది.

అర్చ‌నా గౌత‌మ్‌ను మేరఠ్‌లోని హస్తినాపుర్‌ నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్‌ ప్రకటించింది. దీనిపై బీజేపీ, హిందూ మహాసభ మండి పడుతున్నాయి. చౌకబారు ప్రచారాల కోసం అర్చనా లాంటి వ్యక్తికి కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చిందని బీజేపీ విమ‌ర్శిస్తోంది. 

మానసికంగా దివాలా తీసిన పార్టీ నుంచి గొప్ప పనులను ఆశించలేమని అఖిల భారత హిందూ మహాసభ, సంత్‌ మహాసభ వ్యాఖ్యానించింది. హస్తినాపుర్‌ ప్రాంతం పవిత్రమైనదని.. అర్ధనగ్నంగా ఫొటోలను పోస్ట్‌ చేసే ఈ మహిళ వ్యవహార తీరు వల్ల.. ఈ పవిత్ర ప్రాంతంలో నివసించే ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని మండిప‌డుతోంది. 

బీజేపీ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ ఖండించింది. రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి ఉన్న కళాకారిణికి అవకాశం ఇవ్వడంలో తప్పేంటని ప్రశ్నించింది. బీజేపీలోనూ చాలా మంది నటులు, కళాకారులు ఉన్నారని, అందులో ఒకరు మంత్రిగా పనిచేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ ఎదురుదాడి చేస్తోంది. మొత్తానికి.. యూపీ ఎల‌క్ష‌న్స్‌లో మాజీ మిస్ బికినీ.. ఇప్పుడో హాట్ హాట్ టాపిక్‌.