TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పొల్యూటెడ్ కు బదులు పొలిటికల్.. నిర్మల ప్రసంగంలో అప్పుతచ్చు

Published on: Wed Feb 1, 2023 11:06AM

నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగం మొత్తం అంకెలగారడీతో సాగుతోంది. ఎక్కడా చెణుకులు, జోకులూ వినిపించడం లేదు. అధికార పార్టీ సభ్యులు బల్లలు చరిచి అభినందించడం వినా నిర్మల బడ్జెట్ ప్రసంగానికి పెద్దగా సభ్యుల నుంచి స్పందన కనిపించడం లేదు.

ఆ పరిస్థితుల్లో నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో దొర్లిన ఒక పొరపాటు సభలో నవ్వులు పూయించింది. తుక్కు విధానం గురించి మాట్లాడుతూ ఆమె పొల్యూటెడ్ వెహికల్ అనబోయి పొరపాటుగా పొలిటికల్ అని పలికారు.

దీంతో సభలో ఒక్క సారిగా నవ్వులు పూశాయి. అప్పటి వరకూ స్తబ్దుగా ఉన్న సభ ఒక్కసారిగా నవ్వులతో మార్మోగిపోయింది. నిర్మల వెంటనే తన తప్పు సవరించుకుని ప్రసంగాన్ని కొనసాగించారు.