TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎన్టీఆర్‌తో జ‌గ‌న్‌ మైండ్‌గేమ్‌!.. వైసీపీ ట్రాప్ నుంచి జ‌స్ట్ మిస్‌!

Published on: Thu Feb 10, 2022 3:26PM

సీఎం జ‌గ‌న్‌రెడ్డితో టాలీవుడ్ ప్ర‌ముఖ‌ల స‌మావేశం. చిరంజీవితో పాటు హీరోలు మ‌హేశ్‌బాబు, ప్ర‌భాస్‌లు కూడా హాజ‌ర‌య్యారు. మీటింగ్‌కు ముందురోజు నుంచి జూనియ‌ర్ ఎన్టీఆర్ పేరు కూడా వినిపించింది. ఆ భేటీ ముందు వ‌ర‌కూ ఎన్టీఆర్ వ‌స్తున్నార‌ని అన్నారు. చార్టెడ్ ఫ్లైట్‌లో ఫోటో చూశాక కానీ తార‌క్ రావ‌ట్లేద‌ని తెలీలేదు. అదేంటి? షెడ్యూల్‌లో ఆయ‌న పేరు ఉన్నా.. చివ‌రి నిమిషంలో ఏం జ‌రిగింది? ఎందుకు జూనియ‌ర్ డ్రాప్ అయ్యారు? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్‌.

ఆరోగ్య కార‌ణాల‌తో ఎన్టీఆర్ వెళ్లలేద‌ని అంటున్నారు. అది సిల్లీ రీజ‌న్ అని అంద‌రికీ తెలుసు. తార‌క్ పేరుతో పెద్ద రాజ‌కీయ‌మే న‌డిచిన‌ట్టు అనుమానం. ప్ర‌స్తుతం ఏయే సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయో.. ఆ సినిమా వాళ్లే జ‌గ‌న్ భేటీకి హాజ‌ర‌వ‌డం ఆస‌క్తిక‌రం. ఆచార్య కోసం చిరు, కొర‌టాల‌.. రాధేశ్యామ్ కోసం ప్ర‌భాస్‌.. స‌ర్కారు వారి పాట కోసం మ‌హేశ్‌.. ఆర్ఆర్ఆర్ కోసం రాజ‌మౌళి వెళ్లార‌ని అంటున్నారు. మ‌రి, ఎన్టీఆర్ వెళ్తున్న‌ట్టు లీకులు రావ‌డానికి కార‌ణం ఏంటి? 

త్రిబుల్ ఆర్‌లో.. చ‌ర‌ణ్‌, తార‌క్‌లు హీరోలు. చిరు వెళ్లారు కాబ‌ట్టి చ‌ర‌ణ్ అవ‌స‌రం లేదు. ఇక ఇంకో హీరో ఎన్టీఆర్ వెళ్లాల్సి ఉండే. అయితే, డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ఉన్నాక‌.. తార‌క్‌తో ఏం ప‌ని అనేది ఇంకో వ‌ర్ష‌న్‌. అందుకే, జూనియ‌ర్ వెళ్ల‌లేద‌ని చెబుతున్నారు. ఇదంతా సినిమా రీజ‌న్స్‌. తెర‌వెనుక పొలిటిక‌ల్ ఎజెండా కూడా ఉంద‌ని అంటున్నారు. 

ఎన్టీఆర్‌ను రాజకీయంగా, టీడీపీ ప‌రంగా మ‌రింత ఇబ్బంది పెట్టేందుకే.. సీఎం జ‌గ‌న్‌ను క‌లిసే వారి జాబితాలో కావాల‌నే తార‌క్ పేరు చేర్చి లీకులు ఇచ్చార‌ని కూడా అంటున్నారు. జ‌గ‌న్‌ను ఎన్టీఆర్ క‌లిస్తే.. అది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. నంద‌మూరి వార‌సుడు.. వైసీపీ అధినేత‌ను క‌ల‌వ‌డం రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే నారా భువ‌నేశ్వ‌రి ఎపిసోడ్‌లో ఎన్టీఆర్ ఉత్తుత్తి రియాక్ష‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. నంద‌మూరి ఫ్యామిలీ సైతం బుడ్డోడిపై గుర్రుగా ఉంది. చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రిపై అసెంబ్లీలో ఎన్టీఆర్ స్నేహితులు కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీలు అలాంటి అసంబద్ధ వ్యాఖ్య‌లు చేశారు. అలా కారుకూత‌లు కూసిన త‌న వారిని గ‌ట్టిగా మంద‌లించ‌కుండా.. నాలుగు మంచిమాట‌లు చెబుతూ ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేయ‌డంపై ఎన్టీఆర్‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అప్ప‌టి నుంచీ తార‌క్‌కు టీడీపీతో, నంద‌మూరి ఫ్యామిలీతో బాగా గ్యాప్ వ‌చ్చేసింది. ఇక‌, ఎన్టీఆర్‌ను మ‌రింత ఇర‌కాటంలో ప‌డేసేందుకే.. జ‌గ‌న్‌తో భేటీకి జూనియ‌ర్ వ‌స్తున్నారంటూ వైసీపీ వ‌ర్గాలు ప్ర‌చారం చేశాయ‌ని అంటున్నారు. 

జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై వైసీపీ ఎప్ప‌టినుంచో మైండ్‌గేమ్ ఆడుతోంది. కొడాలి నాని ప‌దే ప‌దే హ‌రికృష్ణ‌ను, తార‌క్‌ను పొగ‌డ‌టం అందులో భాగ‌మే. ఇక‌, ఎన్టీఆర్‌కు పిల్ల‌నిచ్చిన మామ నార్నే శ్రీనివాస‌రావు వైసీపీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ కూడా ఆశించారు. తార‌క్ సైతం ప‌రోక్షంగా వైసీపీతో అంట‌కాగుతున్నార‌నే అనుమానాలూ లేక‌పోలేదు. ఆఫ్ ది రికార్డ్‌.. ఎన్టీఆర్‌, కొడాలి, వ‌ల్ల‌భ‌నేనిల స్నేహం కొన‌సాగుతోంద‌ని.. అదును కోసం జూనియ‌ర్ ఎదురుచూస్తున్నార‌ని అంటారు. అయితే, గ‌త రాజ‌కీయ చేదు అనుభ‌వాల దృష్ట్యా ప్ర‌స్తుతానికి మాత్రం ఎన్టీఆర్ పూర్తిగా సినిమాల‌పైనే ఫోక‌స్ పెట్టార‌నేది వాస్త‌వం. ఎంత కాద‌న్నా.. రాజ‌కీయాల విష‌యంలో ఎన్టీఆర్ మౌన రాజ‌కీయం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌నేది కూడా అంతే వాస్తవం. 

ఆ మౌనాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేలా.. ఎన్టీఆర్ విష‌యంలో వైసీపీ మొద‌టినుంచీ మైండ్‌గేమ్ ఆడుతుండ‌గా.. అందులో భాగంగానే సీఎం జ‌గ‌న్‌రెడ్డితో తార‌క్ భేటీ కాబోతున్నారంటూ కావాల‌నే ప్ర‌చారం చేశార‌ని అంటున్నారు. అయితే, జ‌గ‌న్‌ను క‌లిసే జాబితాలో ఎన్టీఆర్ పేరుండ‌టం నిజ‌మేన‌ని కూడా చెబుతున్నారు. మొద‌ట జ‌గ‌న్‌ను క‌లిసేందుకు తార‌క్ సైతం ఇంట్రెస్ట్ చూపించార‌ని.. అయితే జ‌క్క‌న్న‌లాంటి స‌న్నిహితుల స‌ల‌హాతో.. ఎందుకైనా మంచిద‌ని.. ఇప్పుడే తొంద‌ర‌ప‌డ‌కూడ‌ద‌నే భావ‌న‌తో.. లాస్ట్ మినిట్‌లో.. తార‌క్ డ్రాప్ అయ్యార‌ని కూడా అంటున్నారు.