Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మహిళా ఎంపి దుస్తులు చింపిన పోలీసులు.. ఢిల్లీలో ఉద్యమించిన కాంగ్రెస్
posted on: Jun 17, 2022 7:02AM
దేశంలో ప్రభుత్వ పని తీరును నిరసిస్తూ భారీ నినాదాలతో ఉద్యమించడం మామూలే. కానీ ఇటీవలి కాలంలో వాటిని నివారించ డంలో పోలీసులు అనుసరిస్తున్న విధానం మరీ దారుణంగా, అమానవీయంగా మారింది. వారిని అడ్డుకోవడానికి లాఠీఛార్జీలు చేయడం, టియర్ గ్యాస్ వదలడం, వాటర్ కానన్ లను ప్రయోగించడం వంటివి కామన్. కానీ ఇపుడు ఆందోళనకారులపై లాఠీచార్జితో పాటు తన్నడం, దుస్తులు చింపడం వంటి దారుణాలకూ పోలీసులు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలాంటి సంఘటన ఢిల్లీలో జరిగింది. దీని పట్ల కాంగ్రెస్ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళనను అడ్డుకునే క్రమంలో పోలీసుల చర్యలో మహిళా ఎం.పీ జ్యోతిమణి దుస్తులు చిరిగిపోయాయి.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారించడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దగిన కాంగ్రెస్ శ్రేణులపై ఢిల్లీ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులపై విచక్షనా రహితంగా పోలీసులు దాడులు చేసినట్లు ఆరోపిస్తు న్నారు. మహిళలని కూడా చూడకుండా దుస్తులను చించేశారని తమను అరెస్టు చేసి గుర్తు తెలియన ప్రాంతాలకు తీసికెళ్లారని ఆరోపించారు. తమిళనాడులోని కరూర్కు చెందిన కాంగ్రెస్ మహిళా ఎంపీ జ్యోతిమణి పోలీసుల దాడి తీరుపై సెల్ఫీ వీడియోలో స్పీకర్‌కు విన్నవించారు.
ఢిల్లీ పోలీసులు తమ పట్ల దారుణంగా వ్యవహరంచారని ఆమె ఆరోపించారు. తన దుస్తులను చించేశారని పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు తమను నేరస్థుల్లా ఈడ్చుకు వెళ్లారని తన షూని కూడా లాగేశారని ఆరోపించారు. కనీసం తాగ డానికి మంచినీళ్లు కొనుక్కోవడానికి కూడా వీలు లేకుండా దుకాణదారులను హెచ్చరించడం మరీ దారుణంగా ఆమె పేర్కొ న్నారు. జ్యోతిమని వీడియోను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. మహిళా నిరసనకారుల పట్ల పోలీసులు వ్యవహ రించిన తీరు మరీ దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎంపీకే ఇలా జరిగితే సామాన్యులకు న్యాయం ఎక్కడ జరగుతుందని ఆయన ప్రశ్నించారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై చర్యలు తీసుకోవాలని శశి థారూర్ స్పీకర్‌ను కోరారు.
.


.webp)



