టానిక్ పబ్ పైన పోలీసులు దాడులు: 60 మంది అరెస్ట్
Published on: Sun Jul 8, 2012 12:21PM
హైదరాబాదు బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 12లో ఉన్న టానిక్ పబ్ పైన పోలీసులు ఆదివారం ఉదయం ఐదు గంటలకు దాడి చేశారు. సుమారు 60 మంది యువతీ యువకులను పోలీసులు అరెస్టు చేశారు. టానిక్ పబ్‌ను సీజ్ చేసి, ఎక్సైజ్ యాక్టు కింద కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేశారు. పట్టుబడ్డ వారిలో 14 మంది అమ్మాయిలు ఉన్నారు. మిగిలిన వారు యువకులు. వీరిలో ప్రముఖుల తనయులు ఉన్నట్లుగా తెలుస్తోంది. టానిక్ పబ్ పైన ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పబ్‌ను సీజ్ చేశామన్నారు. పట్టుబడ్డ వారిలో కొందరు ప్రముఖుల పిల్లలు ఉన్నారని, వారి తల్లిదండ్రులను పిలిపించి వారికి కౌన్సెలింగ్ ఇస్తామని రవీంద్ర చెప్పారు.


