TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఒరేయ్.. స్టేషన్‌కురా.. లేకపోతే.. అంటూ అభ్యర్థులకు ఖాకీల బెదిరింపులు

Published on: Wed Feb 3, 2021 8:45AM

ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారంలో పలు చోట్ల పోలీసులు ప్రతిపక్షాలు బలపరిచే అభ్యర్థులను అధికారులు, పోలీసులు వేధిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరంతా అధికార వైసిపి అభ్యర్థులకు కొమ్ము కాస్తూ ప్రతిపక్షాలు బలపరిచే అభ్యర్థులకు కావలసిన సర్టిఫికెట్లను ఇవ్వకుండా.. అలాగే ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటున్న వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఏకగ్రీవాల కోసం తమవంతు కృషి చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

తాజాగా గుంటూరు జిల్లాలో జరిగిన ఒక ఘటన ఈ ఆరోపణలను మరోసారి రుజువు చేస్తోంది. "రేయ్‌... నువ్వు స్టేషన్‌కు రా. లేకపోతె తర్వాత అనుభవిస్తావ్‌. ఎక్కడో ఉండి ఇక్కడ గ్రామంలో అల్లర్లు సృష్టిస్తావా! నీ అంతు చూస్తాం" అంటూ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ తనకు ఫోన్‌చేసి బెదిరించారని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రాణభయంతో తాను స్టేషన్‌కు వెళ్లలేదని, చివరకు నామినేషన్‌ కూడా వేయకుండా.. గ్రామం వదిలి వెళ్లిపోవాల్సి వచ్చిందని అయన కన్నీటి పర్యంతమయ్యాడు. గుంటూరు జిల్లా చుండూరు పంచాయతీకి నామినేషన్‌ వేసేందుకు సిద్ధపడిన తనపై పోలీసులు కేసులు పెట్టి బెదిరింపులకు దిగి, బూతులు తిట్టారని గుడేటి బాలకోటిరెడ్డి ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో అయన పేర్కొన్నారు. తనకు తగిన రక్షణ కల్పించాలని, టీడీపీ అభిమానినంటూ ప్రత్యక్షంగానే తనను పోలీసులు బెదిరించారంటూ యన ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశానని అయన చెప్పారు. తనకు వచ్చిన ఫోన్‌కాల్‌ డేటాతో పాటు, పోలీసుల ఫోన్‌ సంభాషణ రికార్డులను కూడా తన ఫిర్యాదుతో జత చేసినట్టు అయన పేర్కొన్నారు.