TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లిప్ట్ ప్రమాదంలో పోలీసు ఉన్నతాధికారి గంగారాం మృతి

Published on: Tue Mar 11, 2025 1:19PM

కాలం కలసి రాక పోతె తాడే పామై కరుస్తుంది అంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ పోలీసు ఉన్నతాధికారి లిఫ్ట్ ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. సిరిసిల్లలోని ఓ భవనంలో లిఫ్ట్ కేబుల్  సడెన్ గా తెగిపోవడంతో ఒక్కసారిగా లిఫ్ట్  గ్రౌండ్ ప్లోర్ లో పడిపోయింది. ఆ సమయంలో లిఫ్ట్ లోనే ఉన్న  55 ఏళ్ల పోలీస్ అధికారి గంగారామ్  దుర్మరణం పాలయ్యారు. 
గంగారామ్ తెలంగాణ స్పెషల్ పోలీస్ 17వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ గా పనిచేస్తున్నారు. గతంలో ఆయన తెలంగాణ సచివాలయానికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 
తన బ్యాచ్ మెట్ అయిన సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి నివాసానికి వెళ్లిన గంగారం తిరుగు ప్రయాణంలో లిప్ట్ ఎక్కాడు. మూడో అంతస్థులో గేటు తెరచుకోవడంతో గంగారాం చూసుకోకుండా బయటకు వచ్చారు.  వెలుతురు సరిగ్గా లేకపోవడంతో గంగారాం ఒక్క సారిగా గ్రౌండ్ ప్లోర్ లో పడిపోయారు.  పోలీస్ డిపార్ట్ మెంట్ లో మంచి పేరున్న గంగారాం లిప్ట్ ప్రమాదంలో చనిపోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరయ్యింది.