Latest News
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్ జాబ్స్‌కు భారీ నోటిఫికేషన్..
posted on: Apr 25, 2022 5:27PM
ఉద్యోగ నోటిఫికేషన్లు లేక తీవ్ర నిరుత్సాహంలో ఉన్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. భారీగా పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ విభాగాల్లో మొత్తం 17,160 పోస్టులను భర్తీ చేయనుంది. ఆ మేరకు నోటిఫికేషన్ ఇచ్చింది తెలంగాణ సర్కారు.
కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఎస్‌ఐ పోస్టులు భర్తీ చేయనున్నారు. 16,027 కానిస్టేబుల్, 414 సివిల్ ఎస్‌ఐలు, 66 ఏఆర్ ఎస్‌ఐ, 5 రిజర్వ్ ఎస్‌ఐ, 23 టీఎస్‌ఎస్‌పీ ఎస్‌ఐ, 12 ఎస్‌పీఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌లతో పాటు విపత్తు, అగ్నిమాపక శాఖలోనూ 26 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మే 2 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.



.webp)


