TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబుపై దుర్భాషలు.. మాజీ మంత్రి కాకాణికి పోలీసుల నోటీసులు

Published on: Tue Feb 3, 2026 3:51PM

మాజీ మంత్రి, వైసిపి సీనియర్ నే నేత కాకాణికి పోలీసులు నోటీసులు అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాణి అనుచిత వ్యాఖ్యలు చేశారని, దుర్భాషలాడారని కాకాణిపై తెలుగుదేశం నేతలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు అందజేశారు.

నెల్లూరులోని కాకాణి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనకు నోటీసులు అందజేశారు.  తెలుగేదశం నాయకుల ఫిర్యాదు మేరకు నెల్లూరు రూరల్‌, పొదలకూరు, మనుబోలులో  కాకాణిపై కేసులు నమోదయ్యాయి.