చంద్రబాబుపై దుర్భాషలు.. మాజీ మంత్రి కాకాణికి పోలీసుల నోటీసులు
posted on: Feb 3, 2026 3:51PM
.webp)
మాజీ మంత్రి, వైసిపి సీనియర్ నేత కాకాణికి పోలీసులు నోటీసులు అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాణి అనుచిత వ్యాఖ్యలు చేశారని, దుర్భాషలాడారని కాకాణిపై తెలుగుదేశం నేతలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు అందజేశారు.
నెల్లూరులోని కాకాణి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనకు నోటీసులు అందజేశారు. తెలుగుదశం నాయకుల ఫిర్యాదు మేరకు నెల్లూరు రూరల్, పొదలకూరు, మనుబోలులో కాకాణిపై కేసులు నమోదయ్యాయి.



.webp)
.webp)
.webp)
.webp)



