కూకట్‌పల్లిలో భార్యని చంపిన ఇన్‌స్పెక్టర్
Published on: Fri Sep 5, 2014 5:06PM
.jpg)
హైదరాబాద్‌లోనికూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులో ఘోరం జరిగింది. ఒక ఎస్.ఐ. భార్యని చంపి పోలీసులకు లొంగిపోయాడు. సస్పెన్షన్‌లో ఉన్న భానుప్రకాష్ అనే ఎస్.ఐ. తన భార్యను హత్య చేశాడు. తర్వాత పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు. కుటుంబ కలహాల కారణంగానే ఆ ఎస్.ఐ. ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.


