TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భూమా అఖిలప్రియ సోదరుడిపై కేసు నమోదు

Published on: Mon Jun 15, 2020 2:39PM

టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిపై ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆళ్లగడ్డ నగర పంచాయతీ పరిధిలోని పడకండ్ల గ్రామంలో పొలం దారి విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో, ఇరు వర్గాలను ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, ఒక వర్గానికి చెందిన వ్యక్తిని విఖ్యాత్ రెడ్డి స్టేషన్ నుంచి తీసుకెళ్ళాడంటూ ఆయనపై పోలీసులు నమోదు చేశారు. 

పోలీసుల అదుపులో ఉన్న టీడీపీ మాజీ కౌన్సిలర్ ను పోలీస్ స్టేషన్ నుంచి విఖ్యాత్ రెడ్డి తీసుకెళ్లారట. దీంతో, పోలీసులు ఆయన నివాసానికి వెళ్లి, సదరు నిందితుడిని మళ్లీ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విఖ్యాత్ రెడ్డిపై ఐపీసీ సెక్షన్లు 353, 224, 225, 212 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి నిందితుడిని తీసుకెళ్లారంటూ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.