TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ లిక్కర్ స్కామ్.. పోలీసు కస్టడీకి చెవిరెడ్డి..ఆయన ఇద్దరు పీఏల అరెస్టు

Published on: Tue Jul 1, 2025 8:58AM

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో  సిట్ మరో ఇద్దరు కీలక వ్యక్తులను అరెస్టు చేసింది. ఈ ఇద్దరూ కూడా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పీఏలు కావడం గమనార్హం. ఎన్నికల సమయంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు రూ. 8.20 కోట్ంల రూపాయలు తీసుకువచ్చారన్న ఆరోపణలనై చెవిరెడ్డి పీఏ బాలాజీ తో పాటుగా మరో పీఏ నవీన్ ను కూడా సిట్ అధికారులు అరెస్టు చేశారు. వీరిరువురూ గత కొంత కాలంగా పరారీలో ఉండగా, బాలాజీ ఫోన్ లొకేషన్ ఆధారంగా వారు ఇండోర్ లో ఉన్నట్లు గుర్తించిన సిట్ అధికారులు అక్కడకు వెళ్లి బాలాజీనీ, అతనితో పాటు నవీన్ ను కూడా అరెస్టు చేశారు. ఇరువురినీ విజయవాడ తరలించారు. 

ఇలా ఉండగా చెవిరెడ్డి ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. ఆయనను మూడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం (జూన్ 30) ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం (జులై1) నుంచి గురువారం (జులై 3) వరకూ చెవిరెడ్డిని, ఇదే కేసులో మరో ప్రధాన నిందితుడు వెంకటేష్ నాయుడిని కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది.