TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పోకిరిల భరతం పట్టిన పోలీసులు

Published on: Fri May 1, 2026 9:56AM

హైదరాబాద్ పాతబస్తీలో రాత్రి వేళల్లో చోటుచేసు కున్న విచిత్ర మైన ఘటనల వెనక ఉన్న అసలు కథను   పోలీసులు బయటపెట్టారు.హైదరాబాదు నగరంలోని ఐఎస్ సదన్ పోలీసుల దృష్టికి వరుసగా షాపుల అద్దాలు పగలగొ డుతున్న సంఘటనలకు సంబంధించి కేసులు నమోదౌతూ ఉండడంతో అనుమానం మొదలైంది.ఇది సాధారణ చోరీ ప్రయత్నమా..   అల్లరిమూకలా పనా... అన్న సందేహం రావడంతో పోలీసులు దర్యాప్తు కొనసాగించారు.  

ఓ నలుగురు పోకిరీ యువకులు క్వాలిస్ కారులో  రాత్రి వేళల్లో నగర వీధుల్లో సంచరిస్తూ షాపింగ్ మాల్స్,  పెద్ద అద్దాలున్న దుకాణాలను టార్గెట్ చేసుకొని గిల్లెర్‌కు గోలీలు అమర్చి అద్దాలపై గురి పెట్టి కొట్టి పగలగొట్టి వినోదించడం అలవాటుగా మార్చుకున్నారు. ఇలా అద్దాలు ధ్వంసం అవుతుంటే చూస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నట్లుగా పోలీసులు  చెబుతున్నారు.

సైదాబాద్ నుంచి మలక్‌పేట, సంతోష్ నగర్ నుంచి చాంద్రాయణ గుట్ట వరకు అనేక ప్రాంతా ల్లో ఈ ఘటనలు పునరా వృతం కావడంతో పోలీ సులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా దృశ్యాలను జల్లెడ పట్టిన ఐఎస్ సదన్ పోలీసులు  చివరకు నిందితులను గుర్తించారు. ఈ ఘటనలకు సంబంధించి ఖలీద్ బిన్ అలీ, మూసా బావాజీర్, హిలాల్ మొహియుద్దీన్, ముద్దాసిర్ ఖురేషిని అదుపులోకి తీసుకుని.. వారి వద్ద నుంచి క్వాలిస్ వాహనం, రెండు మొబైల్ ఫోన్లు, గిల్లెర్, గోటీలు స్వాధీనం చేసుకు న్నారు. మొత్తం 11 కేసుల్లో వీరి ప్రమేయం ఉన్నట్లుగా బయటపడటంతో నలుగురినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాత్రివేళల్లో ప్రజల్లో భయం కలిగించిన ఈ ‘అద్దాల టెరర్’ కథకు పోలీసులు ఫుల్ స్టాప్ పెట్టినట్టైంది.