TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బిగ్ బాస్ షో పై ఫిర్యాదు.. హౌస్ ను ముట్టడిస్తామని హెచ్చరిక

Published on: Sat Oct 18, 2025 3:38AM

టీవీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గజ్వేల్ కు చెందిన కమ్మరి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్ర శేఖర్, శ్రీనివాస్ లు ఈ ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుందని, షోకు ఎంపిక అయిన వారిలో కొందరికి సమాజంలో విలువ లేదనీ వారా ఫిర్యాదులో పేర్కొన్నారు.  

బిగ్ బాస్ బృందం కుటుంబ విలువలు పాటించని వారిని షోకు ఎంచుకుంటోందని  ఆరోపించారు. దివ్వెల మాధురి, రీతూ చౌదరి లాంటి వారిని సెలక్ట్ చేసుకొని బిగ్ బాస్ సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుందని   అభ్యంతరాలు లేవనెత్తారు. సమాజం సిగ్గు పడే విధంగా నిర్వాహకులు బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నారని, వెంటనే బిగ్ బాస్ షోను నిలిపివేయాలని కోరారు. బిగ్ బాస్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే బిగ్ బాస్ హౌస్ ను ప్రజా సంఘాలు, మహిళా సంఘాలతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు. కర్ణాటకలో చేసిన విధంగా ఇక్కడ కూడా బిగ్ బాస్ బ్యాన్ చెయ్యాలన్నారు.