పోలీసుల పేకాట..

 

విజయవాడలో బెటాలియన్ పోలీసులు బరితెగించారు. భవానీపురం పోలీస్ స్టేషన్ లో ఉన్న అకామిడేషన్‌ కేంద్రంలో పేకాట ఆడుతూ అడ్డంగా బుక్కయ్యారు.  విధులు పక్కనపెట్టి నిత్యం పేకాట ఆడుతూ, మద్యం తాగి వివాదాల్లో నిలవటం పరిపాటిగా మారింది. ఈ తతంగం అంతా ఆర్ఎస్ఐ శ్రీనివాసరావు సమక్షంలోనే జరగటం ఆశ్యర్యం కలిగిస్తోంది. రెండు నెలల క్రితం విజయవాడ బస్టాండులో యువతిని వేధించిన కేసులో ఒకరు, తిరుమలలో మద్యం తాగి విధులు నిర్వహించడంతో మరొకరు సస్పెన్షన్ కు గురయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులు విధులు పక్కనపెట్టి ఇలా మద్యం తాగి పేకాట ఆడటం చర్చినీయాంశంగా మారింది. బెటాలియన్ పోలీసుల తీరుపై ఉన్నతాధికారుల సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు.