తాడేపల్లి వారధివద్ద వలసకూలీలపై విరిగిన లాఠీ...

కూలి కోసం... కూటి కోసం... పట్టణానికి వలసపోయిన కార్మికులకు వచ్చిన కష్టం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం వారి స్వస్థలాలకు తిరిగి వెళ్ళడం వారికి తలకు మించిన భారంగా మారింది. ఎలాగొలా రోడ్లు పట్టుకు నడిచి పోతున్న వారిపై చాలా చెక్ పోస్టుల వద్ద ఖాకీలు కరుణ కురిపిస్తున్నా... కొన్ని ప్రాంతాల్లో మాత్రం కన్నెర్ర చేస్తూనే ఉన్నారు. ఫలితంగా పోలీసు లాఠీ రుచి చవి చూడాల్సి వస్తుంది.

వలస కూలీలపై విచక్షణా రహితంగా వ్యవహరిస్తున్న ఖాకీల్లో... అందరికన్నా తాడేపల్లి పోలీసులు అగ్రభాగాన నిలుస్తున్నారు. పొరుగునే ఉన్న కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట చెక్ పోస్ట్ పోలీసులు వలస కూలీలను ఆదరిస్తుంటే... తాడేపల్లి పోలీసులు తాట తీయడం విమర్శలకు తావిస్తోంది.

వలస కూలీలపై విచక్షణారహితంగా దాడి
కన్యాకుమారి నుంచి ఇక్కడ వరకు లేని నిబంధన కేవలం తాడేపల్లి వచ్చే సరికి ఎలా వచ్చిందో?
అన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన ఏ చెక్ పాయింట్ వద్ద అపని పోలీసులు  ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నాలుగు జిల్లాల్లో ఉన్న చెక్ పోస్టులు వద్ద ఇలాంటి నిబంధన లేదా?!

వలస కూలీలపై ఏకంగా సీఐ స్థాయి అధికారి లాఠీ దెబ్బలు.
దీనిపై రాష్ట్ర స్థాయి అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. అన్ని కిలోమీటర్ల వరకు లేని నిబంధన కేవలం తాడేపల్లి వచ్చే సరికి ఎలా అమలు అవుతోంది.
గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఉన్న చెక్ పోస్టు వద్ద జరిగిన ఘటనలు లేకపోలేదు.

జగ్గయ్యపేట చెక్ పోస్ట్ వద్ద నడక ద్వారా స్వస్థలాలకు వెళుతున్న వలస కార్మికుల కోసం ఏకంగా రిలీఫ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ స్వయంగా పరిశీలించి... వలస కార్మికులతో మాట్లాడి... వారి స్వస్థలాలకు పంపేందుకు చేసిన రవాణా ఏర్పాట్లను వివరించి... అనంతరం వారికి పండ్లు, ఆహార ప్యాకెట్లును అందచేసారు.