కత్తి మహేష్‌పై నగర బహిష్కరణ వేటు.!!

 

వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్ కత్తి మహేష్ పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నగర బహిష్కరణ వేటు విధించారు.. ఈ మధ్య ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మహేష్, శ్రీరాముడి పై అనుచిత వ్యాఖ్యలు చేసారు.. ఈ వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేగింది.. ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ పలుచోట్ల మహేష్ పై కేసులు నమోదయ్యాయి.. అయినా మహేష్ తీరు మారలేదు, తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు చేసున్నారు.. ఆయన వ్యాఖ్యలు ప్రజలకు ఆగ్రహం తెప్పించేలా ఉండటంతో.. శాంతిభద్రతల దృష్ట్యా, పోలీసులు కత్తి మహేష్ ను నగరం బయట వదిలేసి నగరంలోకి రావొద్దని ఆదేశాలు జారీ చేసారు.. దీంతో ఇక ఆయన టీవీ స్టూడియోల్లో కూర్చొని మాట్లాడే అవకాశం ఉండదనేది వారి భావన.. అయితే కత్తి మహేష్ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందిగా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.. ఏంటో ఈ కత్తి సుత్తి ఎప్పుడు వదులుతుందో అంటూ ప్రజలు తలలు పట్టుకునున్నారు.