TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గన్పార్క్ వద్ద ఉద్రిక్తత మోత్కుపల్లి,ఎర్రబెల్లి అరెస్ట్

Published on: Sat Dec 24, 2011 11:14AM

హైదరాబాద్ : ఉరేసుకుందాం రమ్మంటూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును సవాల్ చేస్తూ గన్‌పార్క్‌ వద్దకు ఉరితాడుతో వచ్చిన తెలంగాణ టీడీపీ ఫోరం నేతలు మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకరరావు లను పోలీసులు శనివారం గన్పార్క్ వద్ద అరెస్ట్ చేశారు. వారితో పాటు తెలుగుదేశం ఇతర నాయకులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా టీ-టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అరెస్ట్‌ అయిన నేతలను నాంపల్లి పీఎస్‌కు తరలించారు. తనకు, కెసిఆర్‌కు తాడు తెచ్చానని, ఇద్దరం ఉరేసుకుందాం రావాలని మోత్కుపల్లి నర్సింహులు కెసిఆర్‌ను సవాల్ చేశారు. కెసిఆర్‌పై మోత్కుపల్లి నర్సింహులు తీవ్రంగా మండిపడ్డారు. ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా కెసిఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ పేలని తుపాకి అని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పార్లమెంటు సమావేశాలు నడుస్తుంటే కెసిఆర్ ఫామ్ హౌస్‌లో ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్ పిట్టల దొరలాగా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ వద్ద ఉన్నది కట్టె తుపాకి అని ఆయన వ్యాఖ్యానించారు. మోత్కుపల్లి అరెస్ట్ను నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు పోలీసు వాహనానలకు అడ్డంగా పడుకున్నారు.