లోక్‌సభలో పోలవరంపై ప్రకటన...
Published on: Wed Aug 13, 2014 5:36PM
.jpg)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి వుంది ఎవరు ఎన్ని రకాలుగా బెదిరించినా ఆ దిశగా ముందుకు వెళ్తోంది. ఇటీవలే పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టిస్తున్నప్పటికీ రాజీపడకుండా ముందుకు వెళ్తోంది. తాజాగా బుధవారం నాడు లోక్ సభలో ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన చేసింది. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 276, ఒరిస్సాలోని 8, ఛత్తీస్‌ఘడ్‌లోని 4 గ్రామాలు ముంపుకు గురవుతాయని ఆయన లోక్ సభలో ప్రకటించారు. అలాగే మొత్తం 3,427 హెక్టార్ట అటవీ భూమి కూడా మునిగిపోతుందని లోక్‌సభకు తెలిపారు.


