TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పోలవరం జనహితం కోసం కాదు : మేధాపట్కర్‌

Published on: Mon Jan 9, 2012 3:39PM

హైదరాబాద్‌ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేవలం కొందరి స్వార్థ ప్రయోజనాల కోసమేనని, జనహితం  కోసం కాదని సామాజిక ఉద్యమకారిణి మేధాపాట్కర్‌ పేర్కొన్నారు. 17 రాష్ట్రాల లోక్‌శక్తి అభియాన్‌ యాత్ర సందర్భంగా ఆమె మన రాష్ట్రంలో ప్రజా ఉద్యమ కూటమి తరపున పర్యటిస్తున్నారు. రైతులు, పేద వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, ప్రభుత్వంతో పోరాడేందుకే తాను అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్నట్టు ఆమె చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరిట వేలాది కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి సహజవనరులను నాశనం చేసే హక్కు ఎక్కడిదని ఆమె ప్రశ్నించారు. ఇంజినీరింగ్‌ అనుభవజ్ఞులు ఇచ్చిన సూచనలు పక్కనబెట్టి సొంత ప్రయోజనాల కోసం ప్రాజెక్టు నిర్మాణం చేపడుతుందన్నారు. కేజీ బేసిన్‌లో రైతుల పొట్టకొట్టే విధంగా కార్పొరేట్‌ సంస్థలు సహజ వనరులను దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఏపీలో గత ఏడాది రెండున్నర వేలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా, ప్రభుత్వం మౌనంగా ఎందుకు ఉందని ప్రశ్నించారు. తెలంగాణ కేవలం ప్రాంతంగా విడిపోవాలనే ఆకాంక్ష కంటే, ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు భవిష్యత్‌లో ఏర్పడే రాష్ట్రంలో లేకుండా చూసుకుని అప్పుడు ఆ ప్రతిపాదనను ముందుకు తేవాలని ఆమె సూచించారు. మేధాపట్కర్‌ మెదక్‌, భీమవరం, భద్రాచలంలో పర్యటించనున్నారు.