పీవోకేలో భారత్ మాతాకీ జై.!
Published on: Mon Aug 17, 2026 4:34PM
.webp)
భారత్, పాకిస్తాన్ దేశాలు తమ 80వ స్వాతంత్య్ర వేడుకలను ఇటీవలే ఘనంగా జరుపుకున్నాయి. అయితే రెండు దేశాల వేడుకల్లో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. భారత్ లో కాశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకూ స్వాతంత్ర్య స్ఫూర్తి ప్రస్ఫుటంగా కనిపించింది. ప్రజలలో దేశ భక్తి ఉప్పొంగింది. అదే సమయంలో పాకిస్థాన్ లో మాత్రం భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభం, రాజకీయ అశాంతి ఆ దేశం స్వాతంత్ర్య వేడుకల్లో ప్రస్ఫుటంగా కనిపించింది. పాకిస్థాన్ దేశ వ్యాప్తంగా జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో నిర్లిప్తత కొట్టొచ్చినట్లు కనిపించింది. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దేశ వ్యతిరేకత వ్యక్తమైంది. అక్కడ జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భారత్ మాతాకీ జై నినానాదాలు మిన్నంటాయి.
భారతదేశంలో స్వాతంత్య్ర వేడుకలు ఎంతో ప్రశాంతంగా, ప్రజా భాగస్వామ్యంతో పండుగ వాతావరణంలో జరిగితే.. సరిహద్దుకు ఆవల ఉన్న పాకిస్తాన్‌కు మాత్రం ఈ స్వాతంత్య్ర దినోత్సవం తీవ్ర పరాభవాన్ని, కలవరాన్ని, అవమానాన్ని మిగిల్చింది.
పాకిస్తాన్ ఆగస్టు 14న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవడానికి కేవలం 3 రోజుల ముందు, అంటే ఆగస్టు 11న, ఆ దేశంలోనే అతిపెద్ద భూభాగమైన బలూచిస్తాన్ ప్రజలు స్వతంత్ర బలూచిస్తాన్‌ను ప్రకటించుకున్నారు. ఆ తరువాత ఆగస్టు14 స్వాతంత్ర్య వేడుకల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీవోకేలో జై భారత్ నినాదాలు మిన్నంటాయి. దశాబ్దాలుగా పాకిస్తాన్ పాలకుల వివక్ష, పెరిగిన నిత్యావసర ధరలు, విద్యుత్ ఛార్జీలతో విసిగిపోయిన పీవోకే జనం ప్రభంజనంలా రోడ్లపైకి వచ్చారు. పాకిస్తాన్ జెండాలను, అక్కడి సైనిక అధికారులను నిరసిస్తూ పీవోకే వీధుల్లో భారత అనుకూల నినాదాలు హోరెత్తించారు.
PoK Pro India Slogans, Pakistan Occupied Kashmir Protests, Balochistan Independence, India Independence Day, Kashmir Development, PoK Merger With India


