విజయసాయి వ్యాఖ్యలపై ప్రధాని కార్యాలయం ఫైర్!!

 

పీపీఏ సమీక్షలు, పోలవరం రీటెండరింగ్ వంటి పనులు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులతోనే చేస్తున్నామంటూ వైసీపీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ప్రధాని కార్యాలయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

విజయసాయి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీలో ఏ తప్పులు చేసినా.. వాటిని బీజేపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలన్నింటిని బీజేపీ నేతలు పీఎంవో, అమిత్ షా దృష్టికి తీసుకువచ్చారు.

మరోవైపు పోలవరం రీ టెండరింగ్ మీద హైకోర్టు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయటంతో పీఎంవో అధికారులు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ని వివరణ కోరింది. అదేవిధంగా ప్రధాని మోదీ, అమిత్ షా ఆశీస్సులతోనే ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్న విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై పీఎంవో ఆగ్రహం వ్యక్తం చేసింది. పీఎంవో విజయసాయిని, అజయ్ కల్లాంను ఢిల్లీకి పిలిపించి.. దీనిపై వివరణ కోరింది. ప్రధాని కార్యాలయానికి వెళ్లిన ఇద్దరూ.. పీపీఏ సమీక్షలు, పోలవరం రీ టెండర్లపై వివరణ ఇచ్చారు. పీపీఏల సమీక్షపై పీఎంవోకు అజయ్ కల్లాం నివేదిక కూడా ఇచ్చారు.