జర్మనీ ఛాన్సలర్‌తో నరేంద్రమోడీ భేటీ
Published on: Thu Jul 17, 2014 8:01PM
.jpg)
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కర్‌తో భేటీ అయ్యారు.బ్రెజిల్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న మోడీ తరుగు ప్రయాణంలో శనివారం నాడు జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్డ్‌లో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా జర్మన్ చాన్సలర్ మెర్కర్‌తో మాట్లాడారు. శనివారం నాడు మెర్కర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా నరేంద్రమోడీ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపారు.తమ చర్చలు భవిష్యత్‌లో ఇరు దేశాలు కలిసి పనిచేసేందుకు ఉపకరిస్తాయని అనంతరం మోడీ విలేకరులతో అన్నారు.


