TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పోపుల డబ్బాపై సర్జికల్ స్ట్రైక్!

Published on: Wed Nov 9, 2016 12:01PM

మోదీ పాత 500, 1000 నోట్లు ఎందుకు రద్దు చేశారు? నల్లధనం అరికట్టడానికి! కాని, ఆయన ఎంత మాత్రం ఊహించని చోట్ల లోంచి నల్లధనం బయటకొస్తుందంటున్నారు హ్యాపీ హజ్బెండ్స్! అదేంటి, హజ్బెండ్స్ కి, బ్లాక్ మనీకి ఏంటి సంబంధం అంటారా? వుంది! అంతే కాదు, దేశ వ్యాప్త బ్లాక్ మనీ పై యుద్ధానికి వంటిళ్లలోని పోపుల డబ్బాలకి కూడా లింక్ వుంది! ఆ ఫన్నీ మ్యాటర్ ఏంటో చూద్దాం రండి...


ఉద్యోగాలు చేసే ఆడవాళ్ల సంగతేమోగాని ఇంటి పట్టునుండే గృహలక్ష్ములు తమ లక్ష్మీదేవిని ఎక్కడ దాచిపెడతారు? అదేనండీ డబ్బులు ఎక్కడ వుంచుతారు? పోపుల పెట్టెలో. అక్కడ వుంటే భర్తకి అస్సలు తెలిసే ఛాన్స్ వుండదు. అందుకే, ధైర్యంగా అక్కడ దాచేస్తుంటారు హౌజ్ వైవ్స్. అయితే, అవ్వి వాళ్లు అవసరం వచ్చినప్పుడు కుటుంబానికే వాడుతుంటారనుకోండి.... అది వేరే విషయం. కాని, మొత్తానికి ఈ పోపుల పెట్టెలోని డబ్బు మాత్రం ఒక విధంగా ఆ ఇంటిలోని బ్లాక్ మనీనే!. ప్రతీ ఇంట్లో పోపుల పెట్టెలో పోగైన నల్లదనం ఇప్పుడు మోదీ 500, 1000నోట్ల నిషేధం నిర్ణయంతో బయటకొస్తోందట! ఇంత కాలం హజ్బెండ్స్ కి తెలియకుండా వుంచిన డబ్బంతా వాళ్లకు అప్పగించేస్తున్నారట భార్యలు. తీసుకెళ్లి బ్యాంకుల్లో వేయమని అర్ధించటమో, ఆర్డర్ వేయటమో చేస్తున్నారట! ఈ పరిణామంతో మొగుడ్స్ కూడా పెళ్లామ్స్ సీక్రెట్స్ బయటపడ్డందుకు ఫుల్ ఖుష్ అవుతున్నారు!


మోదీ నల్లధనంపై పోరు అంటే... బిజినెస్ మెన్, పొలిటీషన్స్, పాకిస్తాన్, ఫేక్ కరెన్సీ... ఇవన్నీ ఆలోచించి వుంటారు కాని... కిచెన్ లో పోపు డబ్బాని అస్సలు ఊహించి ఉండరు!