కొత్త రూ.500, రూ.2000 నోట్లు ఇలా ఉంటాయి..

దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న అవినీతిని అంతం చేయడానికి పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోడీ సంచలన నిర్ణయం ప్రకటించారు. ప్రధాని అలా ప్రకటించారో లేదో ఆ వెంటనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నోట్ల తాలుకూ ఫోటోలను విడుదల చేశాయి. దీనిలో భాగంగా ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోన్న రూ.2000 నోటును కూడా విడుదల చేసింది. ఈ నోట్లు నవంబర్ 10 నుంచి అందుబాటులోకి రానున్నాయని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి.