ప్రధాని మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ కి అస్వస్థత
Published on: Tue Feb 28, 2023 12:07PM
ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు, ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ప్రహ్లాద్ దామోదర దాస్ మోడీ అస్వస్థతకు గుర్యయారు.
అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ప్రహ్లాద్ మోడీని చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.
ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ప్రహ్లాద్ అహ్మదాబాద్‌లో కిరాణా దుకాణాన్ని నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రాంతాల సందర్శనలో భాగంగా ఆయన చెన్నైలో ఉండగా ఆస్వస్థతకు గురయ్యారు.


