TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబుకి మోదీ చురక.. ఓడిపోతామని తెలిసే

Published on: Fri May 10, 2019 5:00PM

 

ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంల ట్యాంపరింగ్, వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అంశాలను ఏపీ సీఎం చంద్రబాబు తెరపైకి తెచ్చారు. పలు విపక్ష పార్టీలకు చెందిన నేతలను కలుపుకొని జాతీయ స్థాయిలో పోరాడుతున్నారు. ఎన్నికల్లో పారదర్శకత కోసం 50శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకు ప్రధాని మోదీ పరోక్షంగా చురకలంటించారు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిశాక.. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. హర్యానాలోని రోహతక్‌లో మోదీ మీడియాతో మాట్లాడుతూ.. "మొదటి మూడు విడత ఎన్నికల సమయంలో విపక్షాలన్నీ నన్నే టార్గెట్ చేశాయి. కానీ గాలి ఎటు వీస్తుందో అర్థమయాక యూటర్న్ తీసుకున్నారు. ఓడిపోతామని తెలిశాక ఇప్పుడు ఈవీఎంలను నిందిస్తున్నారు. క్రికెట్‌లో ఔటైన బ్యాట్స్‌మెన్ కొన్నిసార్లు అంపైర్‌ను దుర్భాషలాడతారు. ప్రస్తుతం విపక్షాలు అలాగే చేస్తున్నాయి. అనవసరంగా ఎన్నికల సంఘాన్ని దూషిస్తున్నాయి." అని అన్నారు.