అమెరికాలో మోడీకి గ్రాండ్ వెల్ కం..
Published on: Thu Sep 23, 2021 10:47AM
భారత ప్రధాని నరేంద్ర మోడీకి అగ్రరాజ్యం అమెరికాలో ఘన స్వాగతం లభించింది. వాషింగ్టన్‌లో ల్యాండన ప్రధాని మోడీని ఇండియన్-అమెరికన్లు ఘనంగా స్వాగతించారు. అమెరికాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఐదు రోజుల పాటు సాగనుంది. ఈనెల 26న అమెరికా నుంచి తిరిగి రానున్నారు నరేంద్ర మోడీ.
గరువారం వాషింగ్టన్‌లో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో ప్రధాని మోడీ భేటీ కానున్నారు. ఆమెతో వివిధ అంశాలపై చర్చించనున్నారు. శుక్రవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా అమెరికాతో భారత ద్వైపాక్షిక సంబంధాలు, పెట్టుబడులు, అఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితులు, ఉగ్రవాద నిర్మూలన తదితర అంశాలపై చర్చించనున్నారు. అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడమే ఈ పర్యటన ఉద్దేశమని ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాకు బయలు దేరే ముందు చెప్పారు.


