TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కార్యాలయంలోకి వచ్చి ఎలా దాడిచేస్తారు.. సంజయ్ ఘటనపై ప్రధాని మోడీ సీరియస్ 

Published on: Sat Jan 8, 2022 5:24PM

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. ఇటీవలే జైలుకు వెళ్లి వచ్చిన సంజయ్ కు ప్రధానమంత్రి పరామర్శించారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను మోడీ అడిగి తెలుసుకున్నారు. ఈనెల రెండవ తేదీన జగ జాగరణ దీక్ష తదనంతరం జరిగిన పరిస్థితులను ప్రధానికి సంజయ్ వివరించారు.మోడీని రాష్ట్రానికి రావాలని సంజయ్ ఆహ్వానించారు. మీ ఆశీర్వాదంతో తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని ప్రధానికి చెప్పారు సంజయ్. 317జీవోపై మోడీ ఆరా తీశారు. వ్యక్తిగతంగా సంజయ్‌పై దాడి చేయడానికి కారణాలు ఏంటని  ప్రశ్నించారు.

దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల విజయాలను సంజయ్ తో ఫోన్ చర్చల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు. సంజయ్ పోరాటాన్ని ప్రధాని మెచ్చుకున్నారు. ప్రజాసమస్యలపై ఎన్నిసార్లు జైలుకు వెళ్ళిన తప్పులేదన్నారు. ఎంపీ కార్యాలయంపై దాడిని మోడీ ఖండించారు. అసలు కార్యాలయంలోకి వచ్చి ఎలా దాడిచేస్తారని ఆరా‌ తీశారు. సంజయ్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. గాయాలపా‌లైన కార్యకర్తలకు అండగా ఉందామని ప్రధానమంత్రి భరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయాలని, మీకు అన్ని విధాలా అండగా ఉంటామని బండి సంజయ్ కు ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు.