TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎక్స్ ఖాతా డీపీ మార్చుకున్న ప్రధాని మోడీ.. కొత్త డీపీ ఏంటంటే?

Published on: Thu May 7, 2026 12:01PM

దేశ భద్రత విషయంలో రాజీ  ప్రశక్తే లేదని ప్రధాని  నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు.  ఆపరేషన్ సిందూర్  చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా దేశ ప్రజలను ఉద్దేశించి భావోద్వేగ పోస్ట్ పెట్టారు. అంతేకాకండా మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు.

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ సమయంలో మన బలగాలు ప్రదర్శించిన ధైర్యసాహసాలను ఆ పోస్టులో కొనియాడిన ప్రధాని..  మన సైన్యం సాటిలేని ధైర్యం, కచ్చితత్వాన్ని ప్రదర్శించి పహల్గాం కుట్రదారులకు తగిన గుణపాఠం చెప్పిందని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించే వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు.