TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్వాతంత్ర్య దినోత్సవ వేళ పిల్లలతో మోడీ ముచ్చట్లు

Published on: Mon Aug 15, 2022 3:35PM

నేటి బాలలే రేపటి పౌరులు.. ప్రధాని మోడీ ఆ రేపటి పౌరులతో మమేకమై వారిని ఉత్సాహ పరుస్తూ వారి మధ్య కలియదిరిగారు. వారు నృత్యం చేస్తుంటే చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశారు.

ఈ దృశ్యం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద కనిపించింది. ఎర్రకోట బురుజుల మీద నుంచి ప్రసంగించిన అనంతరం ప్రధాని మోడీ ఆజాదీ కా అమృతోత్సవ్ కార్యక్రమానికి వచ్చిన చిన్నారుల వద్దకు వెళ్లారు. దేశ పటం ఆకారం లో కూర్చుని ఉన్న వారి వద్దకు వెళ్లి వారితో ముచ్చటించారు. వా

రిని వారి వారి సంప్రదాయాలకు అనుగునంగా నృత్యం చేయమని ప్రోత్సహించారు. చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశారు. మోడీ చిన్నారులతో కలిసి ముచ్చటించడం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ లో లేదు. హఠాత్తుగా ప్రధాని పిల్లల మధ్యకు వెళ్లి వారితో ముచ్చటించడం, వారి మధ్య కలియదిరగడంతో పిల్లలలో ఉత్సాహం వెల్లివిరిసింది. వారంతా మోడీతో మాట్లాడేందుకు, ఆయనతో కరచాలనం  చేసేందుకు పోటీ పడ్డారు.