ఏపీలో మూడు ప్రాజెక్టులు ప్రారంభించిన మోదీ!!

 

ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మూడు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రారంభించారు. ముందుగా గన్నవరం విమానాశ్రయంలో దిగిన మోదీకి.. గవర్నర్‌ నరసింహన్‌, సీఎస్‌ అనిల్‌ చంద్ర పునేఠ, డీజీపీ ఆర్పీ ఠాకూర్‌, విజయవాడ సీపీ స్వాగతం పలికారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కామినేని శ్రీనివాస్‌, తదితరులు ప్రధానికి కండువాలు కప్పి ఆహ్వానించారు. మోదీ రాక సందర్భంగా విమానాశ్రయం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి మోదీ గుంటూరుకు హెలికాప్టర్‌లో చేరుకున్నారు. గుంటూరు పర్యటనలో మోదీ మూడు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రారంభించారు. విశాఖలో రూ.1178 కోట్లతో నిర్మించిన చమురు నిల్వ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. కృష్ణపట్నం పోర్టు వద్ద రూ.700 కోట్లతో నిర్మించనున్న బీపీసీఎల్‌ కోస్టల్‌ టెర్మినల్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అమలాపురం వద్ద ఓఎన్‌జీసీ వశిష్ట, ఎస్1 ఆన్‌షోర్‌ ప్రాజెక్టును రిమోట్‌ ద్వారా ప్రారంభించారు.