ఒడిశాలో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే
Published on: Mon May 6, 2019 12:49PM

ఫొని తుఫాన్ ఒడిశా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఒడిశాలో 5 వేల గ్రామాలు, 50 పట్టణాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. వేల మంది నిరాశ్రయులయ్యారు. తుఫాన్ ధాటికి ఇప్పటి వరకు 30 మందికి పైగా మృతిచెందారు. అయితే ఈరోజు ఒడిశాలో ఫొని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఉదయం ప్రత్యేక విమానంలో భువనేశ్వర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ స్వాగతం పలికారు. అనంతరం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నవీన్ పట్నాయక్‌తో కలిసి మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. కాగా, తుఫాన్ తో అతలాకుతమైన ఒడిశా రాష్ట్రానికి కేంద్రం ఇప్పటికే రూ.వెయ్యికోట్ల సాయం ప్రకటించింది.


