TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హెల్త్ వర్కర్లు, 60 ఏళ్లవారికి మూడో డోస్.. ఒమిక్రాన్ భయం వద్దన్న ప్రధాని మోడీ  

Published on: Sat Dec 25, 2021 9:11PM

దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 15 నుంచి 18 ఏళ్ల మధ్య వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. జనవరి 3 నుంచి 15 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. త్వరలోనే దేశంలో డీఎన్ఏ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. జనవరి 10 60 ఏళ్లు పైబడిన వాళ్లతో పాటు హెల్త్ వర్కర్లకు ప్రికాషన్ డోస్ వేస్తామన్నారు ప్రధాని మోడీ.శనివారం రాత్రి ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు.

మన దేశంలో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న వేళ అందరం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఒమిక్రాన్‌ వస్తోందని ఎవరూ భయాందోళనకు గురికావొద్దన్నారు.  ఒమిక్రాన్‌తో ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. ఇవాళ దేశవ్యాప్తంగా 18 లక్షల పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. పిల్లలకు 90వేల బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయన్నారు. దేశంలో ఔషధాలకు ఎలాంటి కొరతా లేదని చెప్పారు.

ఒమిక్రాన్‌ నివారణకు టీకాలు, జాగ్రత్తలే మందు అని ప్రధాని మోదీ చెప్పారు. అనేక రాష్ట్రాల్లో 100 శాతం కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తయిందన్నారు. కొత్త సంవత్సరం కోసం అంతా ఆతృతతో ఎదురుచూస్తున్నాం.. కానీ ఇది అప్రమత్తంగా ఉండాల్సిన సమయమని అన్నారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడం మరిచిపోవద్దని విజ్ఞప్తి చేశారు. వైద్య సిబ్బంది కఠోర శ్రమవల్లే 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయిందని చెప్పారు. 11 నెలలుగా దేశంలో వ్యాక్సినేషన్‌ ఉద్యమం కొనసాగుతోందన్నారు.